గ్రీన్ టీ, హనీ మిక్స్
తయారీ:ఓ గిన్నెలో పాలను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక, చక్కెర, తేనె, గ్రీన్ టీ ఆకులు వేసి మరికొంచెం సేపు పొయ్యిమీద ఉంచాలి. పాలు మళ్లీ ఓ పొంగు వచ్చాక వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకుని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీయాలి. అందులో గిలకొట్టిన క్రీం, నిమ్మరసం, నిమ్మపొట్టుపొడి, చివరగా జెలాటిన్‌ని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. చల్లగా ఉండే ఈ గ్రీన్‌టీ పానీయం చాలా రుచిగానూ ఉంటుంది.
లేయర్డ్ బనానా ఫుడ్డింగ్
కావల్సినవి:
మైదా - అరకప్పు, బ్రౌన్‌షుగర్ - రెండున్నర కప్పులు, పాలు - రెండుకప్పులు, గుడ్లు -రెండు వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్ - చెంచా, గిలకొట్టిన క్రీం - కప్పు, అరటిపండ్లు - ఆరు (చక్రాల్లా తరగాలి), డ్రైఫ్రూట్స్ పలుకులు - కొన్ని...
తయారీ: వెడల్పాటి పాన్‌లో మైదా, బ్రౌన్‌షుగర్ వేసి కలిపి పొయ్యిమీద పెట్టాలి. తరవాత పాలు పోయాలి. మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ కలిపి తరవాత దింపేయాలి. ఇందులోంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని గుడ్లసొనలో కలపాలి. దీన్ని మళ్లీ మిగిలిన మిశ్రమంలో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత వెన్నా, వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి మరోసారి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు వెడల్పాటి గ్లాసు లేదా గిన్నెలో రెండు అంగుల్లో ఈ మిశ్రమాన్ని పరవాలి. దానిపై కొద్దిగా క్రీం, తరవాత కొన్ని అరటిపండు ముక్కలువేయాలి. దానిపై మిగిలిన మిశ్రమాన్ని మరికొంచెం పరిచి, తరవాత క్రీం మళ్లీ అరటిపండు ముక్కలు పరవాలి. ఇలా మిశ్రమం, క్రీం అరటిపండు ముక్కలు మూడువరుసల్లో పరవాలి. పైన కొన్ని డ్రైఫ్రూట్స్ పలుకులు అలంకరించి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. గంట తరవాత తీసి వడ్డించాలి.
కీరదోస-టమాటా సలాడ్
కావల్సినవి:కీరదోస - మూడు (కాస్త పెద్ద ముక్కల్లా తరగాలి),
తయారీ:వెడల్పాటి సలాడ్ పాత్ర తీసుకుని అందులో పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తినే ముందు వరకు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.. చలచల్లని గ్రీక్ సలాడ్ రుచే వేరు.
అల్ ప్రెడో
కావల్సినవి:పెన్నె పాస్తా - 300గ్రా (గుండ్రంగా, పొడుగ్గా ఉండేవి),
తయారీ:పాస్తాను మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో వెన్న కరిగించి వెల్లుల్లి వేయించి ఆ తరవాత పుట్టగొడుగులు, చికెన్ చేర్చాలి. కాసేపయ్యాక క్రీం, బెషామెల్ సాస్ కూడా వేయాలి.ఇప్పుడు సరిపడా ఉప్పు, మిరియాలపొడి, ఆలివ్ నూనె వేసి.. ఉడికించిన పాస్తా కూడా చేర్చి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేసి పార్మెసాన్ చీజ్, చీజ్ తురుము, పార్స్‌లే తరుగు అలంకరిస్తే.. పసందైన అల్‌ఫ్రెడో సిద్ధం. దీన్ని గార్లిక్ బ్రెడ్‌తో కలిపి తింటే ఆ రుచే వేరు.
ఆపిల్ పాయసం
తయారుచేసే విధానం:ముందుగా కండెన్స్‌డ్ మిల్క్‌లో చల్లని పాలు కలపాలి. ఆపిల్ పండ్ల తొక్కు తీసి గ్రేటర్‌తో సన్నగా తురిమి పాలమిశ్రమంలో కలపాలి. చివరగా బాదం, పిస్తా పప్పుల్ని సన్నగా తురిమి వేయాలి. కుంకుమపువ్వు చల్లి అందించాలి. తాగే తీపిని బట్టి అవసరమైతే కాస్త పంచదార కూడా కలుపుకోవచ్చు.
ఫజెటో
కావలసినవి:మామిడిపండు గుజ్జు: పావుకప్పు, పెరుగు: కప్పు,
తయారుచేసే విధానం:ఓ గిన్నెలో మామిడిపండు గుజ్జు, సెనగపిండి, పసుపు, ఉప్పు వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. తరవాత గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత మామిడిపండు మిశ్రమం వేసి కలపాలి. బెల్లంతురుము వేసి, మంచి నీళ్లు కూడా పోసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం మరగడం ప్రారంభం కాగానే సిమ్‌లో పెట్టి ఐదు నిమిషాలు ఉంచి దించాలి.
ఫ్రూట్ అంబ్రోసియా
కావలసినవి:కొవ్వులేని పెరుగు: అరలీటరు, కొవ్వు లేని చల్లని విప్‌డ్ క్రీమ్:
తయారుచేసే విధానం:పెరుగు, విప్‌డ్ క్రీమ్, చాకొలెట్ పుడ్డింగ్ మిక్స్, పైనాపిల్ జ్యూస్ వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా మృదువుగా అయ్యాక కమలాతొనలు, పైనాపిల్ ముక్కలు వేసి అందించాలి. ఇష్టాన్ని బట్టి ద్రాక్ష, పుచ్చ, యాపిల్... ఇలా ఇతర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.
ఫ్రోజెన్ ఫ్రూట్ యోగర్ట్
కావలసినవి:
పుచ్చకాయ ముక్కలు: రెండు కప్పులు, చిక్కని
పెరుగు: కప్పు, పంచదార: 2 టేబుల్‌స్పూన్లు లేదా తేనె: టేబుల్‌స్పూను, కండెన్స్‌డ్ మిల్క్ క్రీమ్: 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: అరటీస్పూను
తయారుచేసే విధానం:
పుచ్చముక్కల్లో గింజలు తీసేసి ఓ ప్లాస్టిక్ కవరులో వేసి రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టి ఫ్రీజ్ చేయాలి.ఫ్రీజ్ చేసిన పుచ్చముక్కలు, పెరుగు, పంచదార, కండెన్స్‌డ్ మిల్క్ క్రీమ్, నిమ్మరసం మిక్సీలో వేసి బాగా తిప్పాలి. వెంటనే తీసి బౌల్‌లో వేసి ఫ్రీజర్‌లో గంటసేపు ఫ్రీజ్ చేయాలి. తరవాత బయటకు తీసి మళ్లీ మిక్సీలో వేసి మృదువుగా చేసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. ఇలా మూడునాలుగుసార్లు బయటకు తీసి, మిక్సీ చేసి, మళ్లీ ఫ్రీజ్ చేయడంవల్ల ఐస్‌క్రీమ్ మాదిరిగానే మృదువుగా ఉంటుంది.
యాపిల్ ఖీర్
కావల్సినవి:
తయారీ:పొయ్యి మీద బాణలి పెట్టి యాపిల్ తురుము వేయించాలి. పచ్చి వాసన పోయి అది బాగా వేగాక చక్కెరా, డ్రైఫ్రూట్స్ వేసి మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి మిశ్రమం దగ్గరపడ్డప్పుడు దింపేయాలి. వేడి కొద్దిగా తగ్గాక అందులో పాలూ, కోవా, యాలకులపొడీ, కుంకుమపువ్వు రేకలూ వేసి బాగా కలపాలి. తరవాత ఐదు నిమిషాలు పొయ్యిమీద పెట్టి.. దింపేస్తే సరిపోతుంది. ఈ పాయసాన్ని వేడిగానే కాదు.. చల్లగానూ తీసుకోవచ్చు.
మిక్స్‌డ్ ఫ్రూట్‌సలాడ్
కావల్సినవి:స్ట్రాబెర్రీ, యాపిల్, కమలాఫలం, బత్తాయి, కివీ - ఒక్కోటి చొప్పున, నానబెట్టిన బాదం - పది, ఖర్జూరాలు - పది, ఎండుద్రాక్ష - టేబుల్‌స్పూను, అరటిపండ్లు - రెండు, థాయ్‌లిచ్చీ - ఒక గుత్తి, పాలు - లీటరు,
తయారీ:పాలు సగంఅయ్యేదాకా మరిగించాలి. ఇంతలో బియ్యాన్ని దోరగా వేయించి.. చల్లారాక యాలకులతో కలిపి మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పిండి, పంచదారను మరిగిన పాలల్లో వేసి బాగా కలిపితే.. చిక్కగా అవుతుంది. నిమిషమయ్యాక దింపేయాలి. ఇది చల్లారేలోగా.. పండ్లను సన్నగాముక్కల్లా తరిగి.. పాలకు చేర్చాలి. చివరగా మిగిలిన పదార్థాలన్నీ కలిపి.. ఓ రెండుగంటలు ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది. బలవర్థకమైన సలాడ్ సిద్ధం. కమలాఫలం, బత్తాయి తొనల చుట్టూ ఉండే పీచుని తీసి.. ఆ తరవాత కలపాల్సి ఉంటుంది.
పాస్తా సలాడ్
కావల్సినవి:
పాస్తా - రెండు కప్పులు, నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు - చెంచా. సాస్‌కోసం: ఆలివ్‌నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, మైదా - రెండు టేబుల్‌స్పూన్లు, పుదీనా తరుగు - చెంచా, మిరియాలపొడి - అరచెంచా, ఎండుమిర్చి గింజలు - అరచెంచా, క్రీం - కప్పు, పాలు - కప్పు, చీజ్ - పావుకప్పు, పాలకూర తరుగు - రెండు కప్పులు.
తయారీ:ముందుగా పాస్తాను ఉడికించుకోవాలి. ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లూ, నూనె, ఉప్పు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు పాస్తా వేయాలి. పాస్తా ఉడికిందనుకున్నాక దింపేసి నీటిని వంపేయాలి. ఇప్పుడు సాస్ తయారు చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి ఆలివ్‌నూనెను వేడిచేయాలి. అందులో మైదా వేయించాలి. రెండు నిమిషాల తరవాత పుదీనా తరుగూ, మిరియాలపొడీ, ఎండుమిర్చి గింజలూ వేసి కలపాలి. తరవాత క్రీం కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇది ఉడికాక పాలు పోసి మరోసారి కలపాలి. రెండు నిమిషాలాగి పాలకూర తరుగు వేసి మంట తగ్గించేయాలి. దీన్ని మధ్యమధ్య కలుపుతూ కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పొయ్యిమీద పెట్టాలి. తరవాత చీజ్ తురుము వేసి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాపై వేసి కలిపితే చాలు.
థండాయి
కావల్సినవి:పాలు - కప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పు, గులాబీ రేకలు - పావుకప్పు, నీళ్లు - రెండున్నర కప్పులు,బాదంపలుకులు - టేబుల్‌స్పూన్లు, తర్బూజా గింజలు - టేబుల్‌స్పూను, మిరియాలు - చెంచా, గసగసాలు, వాము - అర టేబుల్‌స్పూను చొప్పున, యాలకులపొడి - అరచెంచా. గులాబీనీరు - అరచెంచా.
తయారీ:ఓ గిన్నెలో అరకప్పు నీళ్లు తీసుకుని అందులో చక్కెర వేసి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన నీటిని మరో గిన్నెలోకి తీసుకుని సగం గులాబీరేకలూ, బాదంపలుకులూ, తర్బూజా గింజలూ, మిరియాలూ, గసగసాలూ, వాము వేసుకుని కనీసం గంటా గంటన్నరసేపు నాననివ్వాలి. తరవాత నానబెట్టన వాటిని మాత్రమే మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఓ గిన్నెపై మెత్తని, పల్చని బట్ట పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. దీనిపై నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ వడకట్టుకోవాలి. ఇందులో పాలూ, చక్కెరా, గులాబీనీరూ, మిగిలిన గులాబీరేకలూ, యాలకులపొడి వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఒకటి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరవాత తాగాలి.
No comments:
Post a Comment